- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ రైతులకు అలర్ట్..నేటి నుంచి ‘రైతన్నా.. మీ కోసం’
ఏపీ వ్యాప్తంగా "రైతన్నా.. మీ కోసం" అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. మొత్తం ఏడు రోజుల పాటు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు అలర్ట్. ఇవాల్టి నుంచి ఏపీ వ్యాప్తంగా "రైతన్నా.. మీ కోసం" అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అధికారులు. నేటి నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్ళనున్నారు. సీఎం చంద్రబాబు కూడా కొంత మంది రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల సమాచారాన్ని సేకరించడం, పంటల గురించి రైతులకు పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. పంట ఎంపిక, లాభదాయకమైన పంటలు వేయడం లాంటి అంశాలపై కూడా రైతులకు సమాచారం అందిస్తారు అధికారులు. వ్యవసాయంలో పంచ సూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే లాభాలను కూడా ఈ సందర్భంగా వివరిస్తారు. అగ్రిటెక్ పై రైతులలో చైతన్యం తీసుకువచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. అనంతరం డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రంలో వర్క్ షాప్ నిర్వహిస్తారు. ఖరీఫ్, రబీ పంటలపై పలు సూచనలు చేస్తారు.






