- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో కొత్త కార్యక్రమం...ఈనెల 24 నుంచే ప్రారంభం
ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్నా.. మీ కోసం అనే కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

chandrababu
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు బిగ్ అలర్ట్. ఏపీ రైతుల కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్నా.. మీ కోసం అనే కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే లాభాలు గురించి ఈ కార్యక్రమం ద్వారా వివరించారు. ఈ మేరకు రైతుల ఇంటికి వెళ్లి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి...అవగాహన కల్పిస్తారు. పంట ఎంపిక, లాభాదాయకమైన పంటలు వేయడం లాంటి అంశాలపై వివరిస్తారు.
ఈనెల 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు కూడా నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రైతుల భవిష్యత్తు కోసమే రైతన్నా.. మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో పంచసూత్రాలపై 7 రోజుల పాటు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అగ్రిటెక్ పై రైతులలో చైతన్యం తీసుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ రైతన్నా.. మీ కోసం కార్యక్రమంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.






