- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి మళ్లీ వర్షసూచన.. జాగ్రత్తగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ
మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) మిగిల్చిన పంట, ఆస్తి నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు.

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను (Montha Cyclone) ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు (Heavy Rains) మిగిల్చిన పంట, ఆస్తి నష్టాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మళ్లీ కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ (APSDMA MD Prakhar Jain) వెల్లడించారు. రాష్ట్రంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, సేఫ్ ప్లేసుల్లో ఉండాలని సూచించారు.
మరోవైపు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కొద్దిరోజులపాటు నదికి వరద హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు.. బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులుగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద ప్రవాహం తగ్గేంత వరకూ నదిలే వేటకు వెళ్లరాదని స్థానిక మత్స్యకారులకు సూచించారు.






