- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఇవాళ (జులై 27) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీర ప్రాంతాల్లో ఉన్న నౌకలు, పడవలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున్న విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.






