- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు వర్ష సూచన
by Vemula.Srinu Prasad |
వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.రాబోయే రెండు-మూడు రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ...

X
దిశ, ఏపీ బ్యూరో: వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.రాబోయే రెండు-మూడు రోజుల్లో అదే ప్రాంతంలో కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత వాతావరణ సమాచారం బట్టి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆదివారం శ్రీకాకుళం,అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Next Story






