- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోస్తాంధ్రకు వర్ష సూచన.. మూడు రోజుల పాటు బిగ్ అలర్ట్
by Vemula.Srinu Prasad |
తెలంగాణ, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana), రాయలసీమ(Rayalaseema) నుంచి తమిళనాడు(Tamilanadu) వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర(Kostandra) వ్యాప్తంగా మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorology Department) వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల ఆకాశం మేఘావృతమై ఉండి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాల సమయంలో తీరం వెంబడి గంటకు 44 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. రైతులు తమ కోతకు వచ్చిన పంటలను భద్రపరుచుకోవాలని, ప్రజలు పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story






