ఏపీకి వర్ష సూచన.. ఐదు రోజులపాటు అలర్ట్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తూర్పు విదర్భ ప్రాంతం నుంచి ఏపీ మీదుగా బలమైన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు...

ఏపీకి వర్ష సూచన.. ఐదు రోజులపాటు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తూర్పు విదర్భ ప్రాంతం నుంచి ఏపీ మీదుగా బలమైన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం తీవ్ర అలజడిగా మారనుందని తెలిపారు. అలాగే తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా తీర ప్రాంతంలోని మత్స్యకారులు రాబోయే ఐదు రోజుల పాటు వేటకు వెళ్ళరాదని అధికారులు స్పష్టం చేశారు. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

వేపాడలో అత్యధికంగా 9 సె.మీ వర్షపాతం

అయితే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదు అయిందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా వేపాడలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు పేర్కొన్నారు.

Next Story