- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గ్రామాల్లోకి నకిలీ విత్తనాలు వస్తే మీదే బాధ్యత’.. వ్యవసాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే హెచ్చరిక
గ్రామాల్లోకి వచ్చే నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని లేని పక్షంలో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ హెచ్చరించారు.

దిశ,తుంగతుర్తి: గ్రామాల్లోకి వచ్చే నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని లేని పక్షంలో వారే బాధ్యత వహించాల్సి వస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ హెచ్చరించారు. నకిలీ వాటితో రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ పరిధిలో ఎంఎన్ఏపీ పథకం కింద వచ్చిన కందులు,పెసర్ల సంచులను గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏడిఏ రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగు పులిమిన పత్తి గింజలను గ్రామాల్లోకి వస్తున్నాయని పేర్కొంటూ వీటిపై అధికారులతో పాటు రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నష్టం జరిగే పనులతో రైతాంగం రోడ్డు మీదికి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. కాలానుగుణంగా రైతాంగం పెసర్లు, కందుల పంటలు సాగు చేయాలన్నారు. జొన్నల సాగు ఆశాజనకంగా లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, ఎంపీడీవో సందీప్ కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి, నూతనకల్, తిరుమలగిరి మండలాల సహకార సంఘాల చైర్మన్లు గుడిపాటి సైదులు, జయసుధ, చంద్రశేఖర్, సర్పంచ్ మల్లె పాక సాయిబాబు, గ్రంథాలయ శాఖ చైర్మన్ గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.






