- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rain alert | కోస్తాంధ్ర.. రాయలసీమకు ఎల్లో అలర్ట్
మలక్కా-దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మలక్కా-దక్షిణ అండమాన్ సముద్రం మధ్య అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. నవంబరు 24న ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు కోస్తాంధ్ర, రాయలసీమకు అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. రానున్న 48 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాలో తేలికపాటి వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని అధికారులు కోరారు.
Next Story






