- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు
ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ముడు రోజుల పాటూ వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ముడు రోజుల పాటూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఊదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈరోజు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అదే విధంగా రేపు శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూల్, అనంతపూర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూర్, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ ఏడాది ఎండాకాలంలోనే ఎండలతో పాటూ భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పిడుగుపాటు ఘటనలు సైతం చోటు చేసుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.






