- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) కీలక ప్రకటన చేసింది

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Department of Meteorology) కీలక ప్రకటన చేసింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రేపు(మంగళవారం) మన్యం, అల్లూరి , విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల(Heavy Rains) నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తరుణంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగులు వద్ద ఉండరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






