Heavy Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-13 08:23:18  IST  )

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 5.8 కి.మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈ ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉంది అని APSDMA తాజాగా వెల్లడించింది.

దీంతో ఏపీలో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఇవాళ(శుక్రవారం) ఏపీ(Andhra Pradesh)లోని మన్యం, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు(Rains) పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురిసే అవకాశం ఉంది.

ఈ క్రమంలో వాతావరణం(Weather)లో చోటుచేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Meteorological Department) అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆకస్మిక పిడుగులు పడే ఛాన్స్ ఉండడం వల్ల ప్రజలు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు.. తెలంగాణ(Telangana)లోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story