Heavy Rain Alert: రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-22 02:00:08  IST  )

రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

Heavy Rain Alert: రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ(Meteorological Department) మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఎండలు దంచికొట్టిన సాయంత్రం కాగానే వాతావరణం(Weather) చల్లబడుతుంది. ఈ క్రమంలో రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(శనివారం) శ్రీశైలం, తూర్పుగోదావరి, చిత్తూరు, అమలాపురం, కాకినాడ, యానాం, నెల్లూరులో వర్షాలు కురిసినట్లు తెలిపారు. ఈ క్రమంలో గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోని శ్రీశైలంలో గరిష్ఠంగా 40 మి.మీ, రాజమహేంద్రవరంలో 30 మి.మీ, చిత్తూరులో 19 మి.మీ, అమలాపురంలో 18 మి.మీ, కంభం, కాకినాడలో 13 మి.మీ, యానాం, నెల్లూరులో 6.6 మి.మీ, తణుకులో 4.8 మి.మీ, బాపట్లలో 4.3 మి.మీ, కావలిలో 4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో రానున్న 24గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ తరుణంలో ఏపీలో రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. ఉత్తర కోస్తా, యానాంలో ఈరోజు(ఆదివారం), రేపు(సోమవారం) అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తరుణంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోసారి రాష్ట్రానికి ఉరుముల(thunder)తో కూడిన భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story