Heavy Rains:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. 5 రోజులు భారీ వర్షాలు!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-13 12:54:07  IST  )

రాష్ట్రంలో ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మ‌రోవైపు అక్క‌డ‌క్క‌డా వర్షాలు ప‌డుతుండటం వేస‌వి నుంచి కాస్త జ‌నాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది.

Heavy Rains:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. 5 రోజులు భారీ వర్షాలు!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే.. మ‌రోవైపు అక్క‌డ‌క్క‌డా వర్షాలు ప‌డుతుండటం వేస‌వి నుంచి కాస్త జ‌నాల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. ఈ క్ర‌మంలో వాతావ‌ర‌ణ శాఖ(Department of Meteorology) మ‌రోసారి చల్ల‌ని క‌బురు చెప్పింది. ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని, అలాగే కొన్ని జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

అండమాన్‌ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు(బుధవారం) ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధవారాల్లో.. ఉత్తర కోస్తా, రాయలసీమ, గురువారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఏపీలోని అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా.

రాబోయే 5 రోజుల్లో పశ్చిమ, మధ్య, దక్షిణ ద్వీపకల్పంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగనున్నట్లు అంచనా. రాబోయే 5 రోజుల్లో ఈశాన్య భారతదేశం(India)లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఏపీలో రాబోయే 5 రోజులు వర్ష సూచన ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ నేప‌థ్యంలో తీర ప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు ఉండ‌వచ్చ‌ని, మ‌త్స్య‌కారులు వేట కోసం స‌ముద్రంలోకి వెళ్లొద్ద‌ని APSDMA హెచ్చ‌రించింది.

Next Story