- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Rains:ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్..రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా పంటపొలాలు, రహదారులు, వాగులు చెరువులను తలపించాయి.

X
దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా పంటపొలాలు, రహదారులు, వాగులు చెరువులను తలపించాయి. రహదారులపై వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా మరోసారి వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. రేపు(బుధవారం) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, ప.గో, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story






