ఏపీ వాసులకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

by Naga Rani Yarlagadda |

నాలుగైదు రోజులుగా మండుటెండలతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ (APSDMA) చల్లని కబురు చెప్పింది.

ఏపీ వాసులకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నాలుగైదు రోజులుగా మండుటెండలతో, ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు వాతావరణశాఖ (APSDMA) చల్లని కబురు చెప్పింది. ఆదివారం సాయంత్రం కాకినాడ, అనకాపల్లి, వైజాగ్ ఔట్సకిర్ట్స్ , విజయనగరం, పార్వతీపురం, అరకు, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురం, కర్నూల్, కడప, ప్రకాశం, నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మిగతా జిల్లాల్లో మాత్రం.. ఆదివారం ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40-41 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణమధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకూ ద్రోణి విస్తరించి ఉన్న కారణంగానే ఉక్కపోత, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది.

Next Story