ఏపీ, కర్ణాటక ప్రయాణికులకు గుడ్ న్యూస్

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది..

ఏపీ, కర్ణాటక ప్రయాణికులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కర్ణాటక(Karnataka) ప్రయాణికుల(Passengers)కు రైల్వే శాఖ(Railway Department) గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్ల గడువును పెంచినట్లు ప్రకటించింది. సంక్రాంతి సందర్భంగా బెంగళూరు-నరసాపురం మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ రైళ్ల గడువును ఇప్పటికే పొడిగించింది. తాజాగా సైతం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు- నరసాపురం ఎక్స్ ప్రెస్(07154) రైలు మార్చి 7వ తేదీ నుంచి అదే నెల 28 వరకు ప్రతి శనివారం రాకపోకలు సాగించనుందని స్పష్టంచేసింది. మార్చి 6 నుంచి 27 వరకూ ప్రతి శుక్రవారం నరసాపురం- ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు(07153) రైలు అందుబాటులో ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే ఈ రెండు రైళ్లకు విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో స్టాపింగ్ ఉందని, ప్రయాణికులు వినియోగించుకోవాలని రైల్వే శాఖ ప్రకటించింది.

Next Story