రైలుపై ఎక్కి వ్యక్తి హల్ చల్.. తీరా చూస్తే..!

by Vemula.Srinu Prasad |

మతిస్థిమితి లేని వ్యక్తి చేసిన పనికి రైల్వే ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు..

రైలుపై ఎక్కి వ్యక్తి హల్ చల్.. తీరా చూస్తే..!
X

దిశ, వెబ్ డెస్క్: మతిస్థిమితి లేని వ్యక్తి చేసిన పనికి రైల్వే ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ వచ్చి ఆగింది. కొంత ప్రయాణికులు రైలు దిగారు. ఈ సమయంలో ఓ యువకుడు అదరా బదరా రైల్వే స్టేషన్‌లోకి వచ్చారు. అందరూ రైలులోకి ఎక్కుతాడనుకున్నారు. కానీ రైలు బండిపై ఎక్కారు. అయితే హైటెన్షన్ వైర్లు తగలకుండా బండిపైనే కూర్చుకున్నారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై యువకుడిని కిందకు దించి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. యువకుడికి మతిస్థిమితం లేకపోవడంతో రైల్వే ఆస్పత్రికి తరలించారు.

Next Story