అబార్షన్ కాదు.. అబార్టెడ్ చేసుకుందట: మళ్లీ దొరికిపోయిన వీణ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-04 11:15:57  IST  )

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాల వీణ (Veena) మరోసారి వీడియో విడుదల చేశారు..

అబార్షన్ కాదు.. అబార్టెడ్ చేసుకుందట: మళ్లీ దొరికిపోయిన వీణ
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar) బాధితురాల వీణ (Veena) మరోసారి వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్ తనకు ఐదు సార్లు అబార్షన్ చేయించారని, ఓ ప్రైవేటు హాస్పిటల్ పేరును బయటకు తీసుకొచ్చిన ఆమె తాజాగా మాట మార్చారు. తాను అబార్షన్ చేయించుకోలేదని, టాబ్లెట్స్ ద్వారా అబార్డెడ్ చేసుకున్నానని తెలిపారు. ఇప్పటికే అరవ శ్రీధర్ వీడియోలను బయటపెట్టిన ఆమె ఆయనకు తెలిసే రికార్డు చేశానని తెలిపారు. తనతో కాకుండా మరో ఆరుగురు అమ్మాయిలతోనూ ఎమ్మెల్యేకు సంబంధం ఉందని ఆరోపించారు. ప్రస్తుతం అరవశ్రీధర్ ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తనను అవాయిడ్ చేస్తూ వచ్చాడని వీణ తెలిపారు. ఆయన ఓ డమ్మీ క్యాండిటేడ్ అని, తాను రూ. 25 కోట్లు అడగలేదని, ఆ వాయిస్ తనది కాదని వీణ స్పష్టం చేశారు. ప్రస్తుతం తనకు జరిగిన 5 అబార్షన్లకు సంబంధించి మెడికల్ ఎగ్జామ్ జరుగుతోందని ఎమ్మెల్యే బాధితురాలు వీణ పేర్కొన్నారు.

సంచలంగా శ్రీధర్, వీణ వ్యవహారం

కాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్, ప్రభుత్వ ఉద్యోగి వీణ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తనను ప్రేమ, పెళ్లి పేరుతో అరవ శ్రీధర్ మోసం చేశారని వీణ ఆరోపించారు. ఈ క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అరవ శ్రీధర్‌తో పాటు వీణపైనా విమర్శలు వినిపించాయి. ఇందంతా రాజకీయ ప్రేరితమని కొందరు కొట్టిపారేశాయి. అయితే తనకు సంబంధించినంత వరకూ ఇది రాజకీయ ప్రేరిపితం కాదని తేల్చి చెప్పారు. తన వెనుక ఏ నాయకుడు లేరని తెలిపింది. కానీ అరవ శ్రీధర్‌ను ఆమె వదలిపెట్టడంలేదు. శ్రీధర్‌పై ఇప్పటికే పోలీసుకలకు ఫిర్యాదు చేశారు. అటు కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. రోజుకో వీడియా విడుదల చేస్తూ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అయితే అబార్షన్ పై వినిపిస్తున్న విమర్శలపై తాజాగా వీణ స్పందించారు. ఇందుకు సంబంధి పూర్తి క్లారీటీ వీడియోను విడుదల చేశారు. అయితే వీడియో చూసిన కొందరు.. వీణపై విమర్శలు కొనసాగుతున్నాయి.. మొన్న అబార్షన్ అన్నారని, ఇప్పడేమో అబార్టెడ్ అంటున్నారని, రోజుకో మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇక అరవ శ్రీధర్ అనుచరులు, జనసేన కార్యకర్తలైతే.. వీణ మళ్లీ దొరికిపోయిందని ఆరోపిస్తున్నారు.

Next Story