ఏపీలో ఆ రైల్వే డివిజన్ ఏర్పాటు సాధ్యంకాదు: రైల్వే బోర్డు సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |

తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ పై రైల్వే బోర్డు స్పందించింది....

ఏపీలో ఆ రైల్వే డివిజన్ ఏర్పాటు సాధ్యంకాదు: రైల్వే బోర్డు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఎన్నోసార్లు రైల్వే బోర్టుకు వివరించారు. పార్లమెంట్ లోనూ వినిపించారు. తిరుపతి డివిజన్ ఏర్పాటుపై చిత్తూరు వైసీపీ ఎంపీ గురుమూర్తి సైతం డిమాండ్ చేశారు.


ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ స్పందించారు. ఎంపీ గురుమూర్తికి లేఖ రాశారు. తిరుపతిలో నూతన రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కొత్త డివిజన్ ఏర్పాటుకు పిజిబిలిటీ లేదన్నారు. గతంలో కొన్ని కమిటీ ఈ విషయాన్ని పరిశీలించినప్పటికీ సిఫార్సు చేయలేదని రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ తెలిపారు.

Next Story