- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు విశాఖకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు విశాఖపట్నానికి రానున్నారు. నేడు, రేపు విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించనుంది. ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన 9మందితో కూడిన స్టాడింగ్ కమిటీ పర్యటించనలో పాల్గొంటుంది.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నేడు విశాఖపట్నానికి రానున్నారు. నేడు, రేపు విశాఖలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించనుంది. ఎంపీ రాధామోహన్ సింగ్ అధ్యక్షతన 9మందితో కూడిన స్టాడింగ్ కమిటీ పర్యటించనలో పాల్గొంటుంది. ఈ కమిటీలో సభ్యులుగా రాహుల్ గాంధీ, జగదీష్ శెట్టర్, మహమ్మద్ హనీఫా ఉన్నారు. ఈ కమిటీ ఆదివారం రాత్రి బెంగళూరు చేరుకోగా అక్కడ నుండి విశాఖకు వచ్చింది.
ఇక నేడు ఎస్ఎస్ టీఎల్న సందర్శించి డీఆర్డీలో ప్రాజెక్టులపై ఈ కమిటీ చర్చించనుంది. రేపు కోస్ట్ గార్డ్ సందర్శించి తీరప్రాంత రక్షణలో దాని పాత్రపై చర్చించనుంది. ఇదిలా ఉంటే రాహుల్ ఏపీలో పర్యటించి చాలా కాలం అవుతోంది. గతంలో భారత్ జూడో యాత్రలో రాహుల్ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. తరవాత ఆయన ఏపీలో పెద్దగా పర్యటించలేదు. ఈ పర్యటనలో ఏపీ కాంగ్రెస్ నేతలను సైతం ఆయన కలవబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.






