కర్నూలు బస్సు ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆవేదన

by Thanuru Gopichand |

కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం విషయంపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు.

కర్నూలు బస్సు ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం విషయంపై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. బస్సు దగ్ధమై అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులు దహనం అవ్వడం తన మనసును కలచివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులు తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులు ప్రయాణించే రోడ్డు రవాణా వ్యవస్థల నిర్వహణ సరిగ్గా లేదంటూ అసహనాన్ని వెల్లిబుచ్చారు. ఇప్పటికైనా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని అభిప్రాయపడ్డారు. వాహనాల నిర్వహణ విషయంలోనే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు.

Next Story