- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక నుంచి ఈ జిల్లాల్లోనూ ఫ్రీగా రాగులు, జొన్నలు
ఇక నుంచి ఈ జిల్లాల్లోనూ ఫ్రీగా రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఇక నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా రేషన్ షాపుల్లో రాగులు, జొన్నలు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో ఈ పంపిణీని కొనసాగిస్తోంది. ప్రజల ఆరోగ్యం, మారతున్న ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వం బియ్యం, పంచదారతో పాటు తృణధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ నెలలో రాయలసీమ జిల్లాలో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కల్పించాలని అడుగులు వేసింది. విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రేషన్ షాపుల్లో బియ్యం, పంచధారతో పాటు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో త్వరలోనే రేషన్ షాపుల్లో జొన్నలు, రాగులు ఉచితంగా అందించనున్నారు. కుటుంబంలో ప్రతి నెల 20 కేజీలు బియ్యం తీసుకుంటే రాగులు కావాలనుకుంటే 18 కిలోల బియ్యం+2 కేజీలు రాగులు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.






