డిప్యూటీ స్పీకర్ రఘురామను బర్తరఫ్ చేయాలి: జడ శ్రవణ్ డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-05 10:28:41  IST  )

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, క్రైస్తవ సంఘాల మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది...

డిప్యూటీ స్పీకర్ రఘురామను బర్తరఫ్ చేయాలి: జడ శ్రవణ్ డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Deputy Speaker Raghu Rama Krishna Raju), క్రైస్తవ సంఘాల(Christian Congregations) మధ్య నెలకొన్న వివాదం మరింత ముదిరింది. తన నియోజకవర్గంలో అనుమతి లేని 113 చర్చి(Church)లకు ఆయన నోటీసులు జారీ చేశారు. దీంతో స్థానిక క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) భీమవరం(Bhimavaram)లో క్రైస్తవ సంఘాలు సమావేశం నిర్వహించారు. రఘురామకృష్ణంరాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ ప్రజాస్వామ్య ద్రోహి అని జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ విమర్శించారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 28న ఏలూరులో లక్ష మందితో సభ నిర్వహిస్తామని జడ శ్రవణ్ హెచ్చరించారు.

Next Story