పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఔరంగజేబును ఓడించారు.. రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది.

పవన్ కల్యాణ్ ఆల్రెడీ ఔరంగజేబును ఓడించారు.. రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలకు ముందే.. ఆంధ్రప్రదేశ్‌లో ఔరంగజేబులాంటి వ్యక్తిని పవన్ కల్యాణ్ ఓడించారని అన్నారు. రియల్‌ లైఫ్‌లో తన సత్తా చాటి.. ఇప్పుడు తెరపై హరి హర వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారని తెలిపారు. ఛత్రపతి శివాజీ కలలు కన్న సామ్రాజ్య స్థాపన కోసం ఏం చేశారో సినిమాలో చూడబోతున్నామని వెల్లడించారు. పవన్ కల్యాణ్ అభిమానుల్లానే తాను కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ అంటే ఒక ఆవేశం, ఉద్వేగం అని చెప్పారు. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి కూడా అని కొనియాడారు. కాగా, ఈ చిత్రానికి క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటించింది. ఏఎం రత్నం నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Next Story