కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు

by Ajay Maddhiboyina |

కొత్తపార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్పందించారు. తాను రాజ‌కీయ‌పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ కొంద‌రు అర్థం ప‌ర్థం లేని మాటలు మాట్లాడుతున్నార‌ని అన్నారు.

కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన రఘురామకృష్ణంరాజు
X

దిశ, వెబ్ డెస్క్: కొత్తపార్టీ పెట్టబోతున్నారు అనే ప్రచారంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్పందించారు. తాను రాజ‌కీయ‌పార్టీ పెట్ట‌బోతున్నా అంటూ కొంద‌రు అర్థం ప‌ర్థం లేని మాటలు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ఫేక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల వ‌ల్ల తాను ఇబ్బందిప‌డిన‌ట్టుగా ఇత‌రులు ప‌డ‌వ‌ద్ద‌ని కొంత‌మంది న్యాయ‌వాదుల‌తో క‌లిపి ఓ ఫోర‌మ్ ఏర్పాటు చేశాన‌ని చెప్పారు. అవ‌స‌ర‌మైన ప్ర‌జ‌లకు ఉచిత స‌ల‌హాలు ఇచ్చేందుకే త‌ను తెలుగువీర లేవ‌రా అనే ఫోర‌మ్ ప్రారంభించాన‌ని అన్నారు. అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ఫోర‌మ్ ఏర్పాటు చేశాన‌ని చెప్పారు.

సొసైటీకి పార్టీకి అస‌లు సంబంధ‌మే ఉండ‌ద‌ని, సొసైటీని ఏర్పాటు చేస్తే పార్టీ పెడుతున్నారంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలుగువీరలేవ‌రా అనేది ప్ర‌జ‌ల‌కు ఉచితంగా లీగ‌ల్ అడ్వైస్ ఇచ్చేందుకు మాత్ర‌మే ఏర్పాటు చేశామ‌న్నారు. తాను టీడీపీలో చాలా సంతోషంగా ఉన్నాన‌ని చెప్పారు. పార్టీలో సీఎంతో, ఇత‌రులతో త‌న‌కు చాలామంచి సంబంధాలు ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. కొత్త పార్టీ ఏర్పాటు వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. ఇదిలా ఉంటే రెండు మూడు రోజులుగా ర‌ఘురామ కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా వినిపిస్తోంది. పార్టీ పేరు కూడా రిజిస్ట‌ర్ చేయించారు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఈ అంశంపై స్పందిస్తూ వీడియోను విడుద‌ల చేసి ఆ వార్త‌ల‌కు చెక్ పెట్టారు.

Next Story