నన్ను చంపాలని చూశారు... సునీల్ కుమార్‌‌పై మరోసారి రఘురామ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ఐపీఎస్ సునీల్ కుమార్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ‌రాజు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ వీడియోల‌ను రిలీజ్ చేస్తున్నారు.

నన్ను చంపాలని చూశారు... సునీల్ కుమార్‌‌పై మరోసారి రఘురామ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎస్ సునీల్ కుమార్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ‌రాజు మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ వీడియోల‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ర‌ఘు రామ కృష్ణ‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సునీల్ కుమార్ విధానాల‌పై దాడి మొద‌లుపెట్ట‌డంతోనే త‌న‌ను చంపాల‌ని చూశార‌ని అన్నారు. త‌న‌ను కొట్టిన‌ప్పుడు డాక్ట‌ర్ల‌తో డా. ప్ర‌భావ‌తి బ‌ల‌వంతంగా సంత‌కాలు పెట్టించి రిపోర్టులు ఇచ్చార‌ని ఆరోపించారు. త‌నను కొట్టినప్పుడు సునీల్ కుమార్ పక్క గదిలోనే ఉన్నాడ‌ని అన్నారు.

విజ‌య్ పాల్ తో క‌లిసి సునీల్ ఉన్నాడ‌ని అన్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత డీఎస్పీ, ఏఎస్ఐ, కొంతమంది కానిస్టేబుల్స్ తో సమావేశమై సునీల్ కుమార్ వాళ్లను బెదిరించాడని చెప్పారు. జ‌రిగింది బ‌య‌ట తెలిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించాడ‌న్నారు. కొట్టించుకున్న విష‌యం త‌న‌కు తెలుసు అని కానీ దేనికైనా సాక్ష్యం అవ‌స‌రం అన్నారు. వెయ్యి శుభములు కలుగు నీకు పోయిరా మరదలా అన్నట్లు నాలుగు గంటల పాటు సునీల్ కుమార్ ని విచారణ చేసి పంపేశారని ఆరోపించారు. మళ్లీ పిలిచారా, లేక మళ్ళీ పిలుస్తారా అనేది త‌నకు తెలియదన్నారు. సాక్షాలు ఉన్నాయి కాబట్టి మ‌ళ్లీ పిలుస్తారని భావిస్తున్న‌ట్టు చెప్పారు.

Next Story