AIMS : మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం

by Muthe.Rajitha |

ఏపీ(AP)లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌(Mangalagiri AIMS)లో ర్యాగింగ్(Ragging) కలకలం రేగింది.

AIMS : మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌(Mangalagiri AIMS)లో ర్యాగింగ్(Ragging) కలకలం రేగింది. తిరుపతికి చెందిన ఓ స్టూడెంట్ ను 15 మంది సీనియర్లు ర్యాగింగ్ చేశారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతికి చెందిన విద్యార్థి హాస్టల్ లోని స్నేహితులతో మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న సీనియర్లు తనను అవమానించేలా మాట్లాడారని ఆ విద్యార్థి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన ఎయిమ్స్ అధికారులు, విచారణ జరిపి 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్(15 Students Suspended) చేశారు. ర్యాంగింగ్ ను సహించేది లేదని, మరోసారి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Next Story