- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP నాయకుల ఇళ్లకు YCP జెండా కడతాం - రాచమల్లు
టీడీపీ ( TDP ) నాయకుల ఇండ్లకే వైసీపీ జెండాలు కడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ (

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ( TDP ) నాయకుల ఇండ్లకే వైసీపీ జెండాలు కడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ ( Rachamallu Sivaprasad ). కడప జిల్లాలో ప్రారంభమైన టిడిపి మహానాడు ( Tdp Mahanaadu) కార్యక్రమానికి... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే క్రమంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టారు రాచమల్లు శివప్రసాద్. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై ఫైర్ అయ్యారు.
కడప జిల్లా అనేది వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Ys Jagan) సొంతమని... ఇక్కడ టిడిపి కూటమి ఏమీ చేయలేదని వార్నింగ్ ఇచ్చారు. కడప ప్రజలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తారని.. స్పష్టం చేశారు. మేము కడపలో మహానాడు వేసామని గొప్పగా చెబుతున్నారు... నక్క వాతలు పెట్టుకున్న అంతమాత్రాన పులి కాదు అంటూ చురకలు అంటించారు.
కడప సెంటర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy) విగ్రహానికి పసుపు జెండాలు ( TDP)కడతారా అంటూ ఫైర్ అయ్యారు. ఇంత దౌర్జన్యంగా టిడిపి నేతలు దిగజారడం దారుణం అన్నారు. తమకు సమయం కూడా వస్తుందని... భగవంతుడు ఆశీర్వాదం ఇస్తే అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ జెండాలు కట్టబోమని.. కేవలం టిడిపి నాయకుల ఇళ్లకు మాత్రమే జెండాలు కడతామని.. హెచ్చరించారు. గుర్తు పెట్టుకోండి.... వైసీపీ జెండాలు కట్టి తీరుతామని అంటూ రాచమల్లు శివప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు.






