- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Moinabad Drugs Case: ఎంపీ పుట్టా మహేశ్ కీలక నిర్ణయం... ఏం చేయబోతున్నారంటే..!
మొయినాబాద్ డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ అడ్డంగా దొరికిపోవడంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి...

దిశ, వెబ్ డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moinabad Drugs Case) రెండు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్(Eluru TDP MP Putta Mahesh Yadav) అడ్డంగా దొరికిపోవడంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. మరోవైపు పుట్టా మహేశ్ వ్యవహారంపై సీరియస్ అయిన అధిష్టానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే పుట్టా మహేశ్ యాదవ్‌కు సమాచారం అందించింది.
న్యాయ పోరాటం వైపు పుట్టా మహేశ్
అయితే ఈ నేపథ్యంలో పుట్టా మహేశ్ యాదవ్ అడుగులపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇందుకు రెండు ముఖ్యాంశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వర్గీయులు పేర్కొన్నారు. చట్ట పరంగా న్యాయం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తొలుత యూరిన్ టెస్టులో నెగిటివ్, బ్లడ్ శాంపిల్స్ ద్వారా పాజిటివ్ రావడంపైనా స్పందించారు. పరీక్షల ఫలితాల్లో వచ్చిన వ్యత్యాసంపై త్వరలోనే పూర్తిస్థాయిలో వివరణ ఇస్తామని చెప్పారు. విచారణలో పోలీసులకు పూర్తి స్థాయిలో మహేశ్ సహకరిస్తారని వెల్లడించారు. ఇక కేసు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు పుట్టా మహేశ్ వర్గీయులు స్పష్టం చేశారు.






