- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పం టీడీపీలో ప్రక్షాళన... సీఎం చంద్రబాబుకు పీఏగా కంచర్ల శ్రీకాంత్
సీఎం చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. పార్టీని మరింతబలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అక్కడ ప్రక్షాళన చేపట్టారు. కుప్పం నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తొలగించారు..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తన కుప్పం నియోజకవర్గం(Kuppam Constituency)పై ఫోకస్ పెట్టారు. పార్టీని మరింతబలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అక్కడ ప్రక్షాళన చేపట్టారు. కుప్పం నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్(MLC Kancharla Srikanth)ను తొలగించారు. ఇకపై తన సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. అంతేకాదు తన పీఏగా శ్రీకాంత్‌ను చంద్రబాబు నియమించుకున్నారు. దీంతో ఆయన సీఎం కార్యాలయం నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.
కుప్పం నేతలతో భేటీ
అమరావతిలో కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. పలువురి పనితీరు సరిగా లేదని సీఎం దృష్టికి వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ప్రక్షాళన తప్పదని చంద్రబాబుకు నేతలు వివరించారు. ఈమేరకు పలువురు నేతలపై వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఊహించని రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.






