Purandheswari : ఢిల్లీ ఫలితాలపై పురంధేశ్వరి హాట్ కామెంట్స్

by M.Rajitha |
Purandheswari : ఢిల్లీ ఫలితాలపై పురంధేశ్వరి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) బీజేపి(BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గాని బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 48 స్థానాలను గెలుచుకుంది. కాగా ఈరోజు సాయంత్రంలోపు ఢిల్లీకి కొత్త సీఎం ఎవరు అనేది అధిష్టానం నిర్ణయించనుంది. కాగా బీజేపీ ఢిల్లీ విజయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, లోక్ సభ ఎంపీ పురంధేశ్వరి(Purandeswari) స్పందించారు. విశాఖపట్నం(Vishakhapatnam)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2024లో ఏపీ(AP)లో జరిగిన ఎన్నికలకు.. ఇప్పుడు ఢిల్లీ(Delhi)లో జరిగిన ఎన్నికలకు భావసారూప్యత ఉందన్నారు. ఏపీలో గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిందన్నారు.

కేవలం దోచుకోవడం మీదనే వైసీపీ(YCP) నాయకులు దృష్టి పెట్టారని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం వల్లే ఏపీలో రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు చేపడుతున్నామని తెలియజేశారు. ఢిల్లీలో ఆప్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గద్దెపై బీజేపీ జెండా ఎగిరిందని, కార్యకర్తల కృషి వల్లే ఇంతటి విజయం సాధ్యం అయిందన్నారు. ఇకపై దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed