విమాన ప్రమాదం పై పురందేశ్వరి దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-13 15:39:39  IST  )

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

విమాన ప్రమాదం పై పురందేశ్వరి దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ రోజు(గురువారం) మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. విమానం కూలిన వెంటనే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.

కిలోమీటర్ల దూరం వరకు ఈ పొగలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషాద ఘటన పై సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన విషాదకరమైన ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమాన సంఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. ఈ విషాద ఘటన పై ఆమె విచారం వ్యక్తం చేశారు. అందరూ క్షేమంగా ఉండాలని ఆమె భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఎంపీ పురందేశ్వరి వెల్లడించారు.

Next Story