క్రెడిట్ కార్డుల వడ్డీపై గరిష్ట పరిమితి విధించండి.. నిర్మలా సీతారామన్‌కు పురంధేశ్వరి వినతి

by Ajay Maddhiboyina |

కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దేశంలో క్రెడిట్ కార్డు వ‌డ్డీ రేట్లు మ‌రియు పెనాల్టీ ఛార్జీల‌పై గ‌రిష్ఠ ప‌రిమితి విధించాల‌ని విన‌తిప‌త్రం అంద‌జేశారు.

క్రెడిట్ కార్డుల వడ్డీపై గరిష్ట పరిమితి విధించండి.. నిర్మలా సీతారామన్‌కు పురంధేశ్వరి వినతి
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా దేశంలో క్రెడిట్ కార్డు వ‌డ్డీ రేట్లు మ‌రియు పెనాల్టీ ఛార్జీల‌పై గ‌రిష్ఠ ప‌రిమితి విధించాల‌ని విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఆర్బీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా వినియోగ‌దారుల హితాన్ని కాపాడే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆర్థిమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇండియాలో క్రెడిట్ కార్డ్ వినియోగ‌దారుల‌పై 24శాతం నుండి 48శాతం వ‌ర‌కు, కొన్ని చోట్ల 55శాతం పైగా వార్షిక వ‌డ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించ‌డం సాధార‌ణ ప్ర‌జ‌ల‌పై తీవ్ర‌మైన ఆర్థిక భారం మోపుతోంద‌ని తెలిపారు.

ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని అన్నారు. భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉంటే దేశంలో క్రెడిట్ కార్డులపై బ్యాంకులు ఇష్టారీతిన వడ్డీ రేట్లను విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది వడ్డీలు కట్టలేక అప్పులపాలు అవుతున్నారు. క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఇష్టారీతిన ఖర్చు చేసి తరవాత తీసుకున్న రుణాలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

Next Story