- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది: చంద్రబాబుకు పెద్దిరెడ్డి హెచ్చరిక
by Vemula.Srinu Prasad |
సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా ప్రతిఫలం అందుకుంటారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) తప్పకుండా ప్రతిఫలం అందుకుంటారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Former Minister Peddi Reddy Ramachandra Reddy) హెచ్చరించారు. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి(Mp Mithun Reddy)తో ఆయన ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మిథున్‌రెడ్డికి జైలులో వసతులు కల్పించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పకుండా ప్రతిఫలం అందుకుంటారని హెచ్చరించారు. మిథున్ ఆరోగ్యంగా, ధైర్యంగా ఉన్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Next Story






