High Court: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-22 17:19:08  IST  )

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలింది...

High Court: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Mla Peddireddy Ramachandra Reddy)కి బిగ్ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా మంగళంపేట(Mangalampet)లో అటవీ భూములు(Forest Lands) ఆక్రమించారని పెద్దిరెడ్డి కుటుంబంపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. అంతేకాదు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబంపై నమోదైన క్రిమినల్ కేసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో హైకోర్టు(High Court)లో పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.

Next Story