పులివెందుల బైపోల్ ఎఫెక్ట్.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ఎదుట YCP నేతల ఆందోళన

by Kema Shiva Kumar |

పులివెందుల ZPTC ఉప ఎన్నికలు యుద్ధ వాతావరణంలో కొనసాగుతున్నాయి.

పులివెందుల బైపోల్ ఎఫెక్ట్.. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ఎదుట YCP నేతల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: పులివెందుల ZPTC ఉప ఎన్నికలు యుద్ధ వాతావరణంలో కొనసాగుతున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీసులు వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు వేంపల్లిలో వైసీపీ నేత సతీశ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా టీడీపీఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు మండల్లాలో ఉప ఎన్నికకు బందోబస్తుకు సుమారు 1,400 మంది పోలీసులను నియమించారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ మానిటరిందగ్ చేస్తున్నారు. పోలింగ్ ప్రారంభం కాకముందే నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లెలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, పోలింగ్ సందర్భంగా వైసీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు విజయవాడలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసు ఎదుట బైఠాయించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు వారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీని కలిసి లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.

Next Story