పులివెందుల ZPTC ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-12 01:34:26  IST  )

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల, ఒంటిమిట్టలో ఇవాళ జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌‌కు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు.

పులివెందుల ZPTC ఉప ఎన్నిక పోలింగ్ షురూ.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల, ఒంటిమిట్టలో ఇవాళ జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌‌కు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఆయన ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఆయన ఇంటి వద్ద అవినాశ్ రెడ్డి బైఠాయించి ఈసీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలను అక్కడి నుంచి పంపి అవినాష్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కడపకు తరలించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని, వేపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

కాగా ఈ ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు నంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. పులివెందున, ఒంటిమిట్ట రెండు మండలాల్లో మొత్తం 1,500 మంది పోలీసులు పహరా కాస్తున్నారు. రెండు మండలాల్లో 10,600 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పులివెందుల ZPTC స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నేత హేమంత్‌ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉపఎన్నికల్లో మొత్తం

Next Story