- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడే పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు
టీడీపీ, వైసీపీ ఛాలెంజింగ్‌గా తీసుకున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటల నుండి రెండు జెడ్పీటీలకు

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, వైసీపీ ఛాలెంజింగ్‌గా తీసుకున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటల నుండి రెండు జెడ్పీటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. ఒక్క రౌండ్‌లోనే పులివెందుల జడ్పీ ఫలితాలు వెలబడనున్నాయి. పులివెందులకు సంబంధించి 10 టేబుళ్లు ఒక రౌండ్‌లో ఫలితాలను లెక్కిస్తారు. ఒంటిమిట్ట జడ్పీటీసీకి సంబంధించి 10 టేబుళ్లు మూడు రౌండ్ లలో ఫలితాలు లెక్కించనున్నారు.
ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే అధికారులు సిద్ధం అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల కోసం ప్రజలు, వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికలు జరిగాయి. ఏకంగా పార్టీ అధినేతలు, మంత్రులు ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. మరోవైపు ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ కూడా బాయ్ కాట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పులివెందులలో బుధవారం జరిగిన పోలింగ్ సైతం వైసీపీ బహిష్కరించింది. కానీ కౌంటింగ్ బాయికాట్‌పై అధికారిక ప్రకటన రాలేదు.






