- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రసవత్తరంగా మారిన పులివెందుల బైపోల్.. 19 నామినేషన్లు దాఖలు
రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ చర్చనీయాంశంగా మారింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా పులివెందులలో పొలిటికల్ హీట్ నెలకొంది. జడ్పీటీసీ మరణంతో పులివెందులలో ఉప ఎన్నిక వచ్చింది. ఈ క్రమంలో పులివెందుల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజవకర్గం పులివెందుల ZPTC ఉప ఎన్నిక స్థానానికి టీడీపీ పోటీ చేయాలని డిసైడ్ అయింది.
ఈ బైపోల్‌కు సంబంధించి ఈ నెల(ఆగస్టు) 1వ తేదీన సాయంత్రం 5 గంటలకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, బీటెక్ సోదరుడు జయభారత్‌రెడ్డి నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి మహేశ్వర రెడ్డి తనయుడు తుమ్మల హేమంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక, కాంగ్రెస్ నేతలు కూడా మేము ఎన్నికల బరిలో ఉన్నామంటున్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 19 మంది నామినేషన్లు సమర్పించారు. ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.






