Pulichinthala: నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల.. పులిచింతల ప్రాజెక్టుకు జలకళ

by Shiva |
Pulichinthala: నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల.. పులిచింతల ప్రాజెక్టుకు జలకళ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా పడుతోన్న భారీ వర్షాల కారణంగా కృష్ణా ప్రాజెక్టులు వదర నీరుతో నిండుగా కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి అధికారులు దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో నిండుకుండలా మారిన సాగర్ నుంచి అధికారులు 2 గేట్లను ఎత్తి దిగువకు లక్షన్నర క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. దీంతో పది రోజుల క్రితం నీరు లేక అడుగంటిన పులిచింతల ప్రాజెక్టు వదర నీటితో కళకళలాడుతోంది. సాగర్ టైల్ పాండ్ నుంచి పులిచింతలకు 30,388 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు 26,083 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.6789 టీఎంసీల నీరు మాత్రమే ఉంది.



Next Story

Most Viewed