పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. వేలంలో కళ్లు చెదిరే ధర

by Naga Rani Yarlagadda |

పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే అనే ఈ నానుడి గోదావరి జిల్లాల్లో బాగా వినిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాలతో పాటు, యానాం మార్కెట్లో పులసల వేలం హడావిడి కనిపిస్తుంది.

పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే.. వేలంలో కళ్లు చెదిరే ధర
X

దిశ, వెబ్‌డెస్క్: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే అనే ఈ నానుడి గోదావరి జిల్లాల్లో బాగా వినిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. గోదావరి జిల్లాలతో పాటు, యానాం మార్కెట్లో పులసల వేలం హడావిడి కనిపిస్తుంది. ఒక్క పులస చేప కోసం వేలల్లో వేలం పాడుతారంటే అతిశయోక్తి కాదండోయ్. మర్యాదలకు ప్రాణమిచ్చే గోదారోళ్లు.. రూపాయి పోయినా సరే.. పులస తినాల్సిందేనని పోటీ పడతారు. ఇక అతిథులకు పులస వడ్డించాలంటే ఆస్తులైనా అమ్మేందుకు రెడీ అంటారు.

వర్షాకాలంలో సముద్రం నుంచి గోదావరికి ఎదురీది గుడ్లు పెట్టేందుకు వచ్చే తల్లి పులసలు.. తిరుగు పయనంలో వలలకు చిక్కుతాయి. ఈ సీజన్ లో మూడో పులస యానాం చేపల మార్కెట్ లో వేలానికి రాగా.. దానిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. చివరికి ఓ వ్యక్తి రూ.12 వేలకు దానిని దక్కించుకున్నాడు. చేపల వేట ఎక్కువగా ఉండటం, సముద్రంలో కాలుష్యం పెరగడం వల్ల కూడా పులసలు పెద్దగా వలలకు చిక్కడం లేదని గోదావరి మత్స్యకారులు చెప్తున్నారు.

Next Story