- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేళ కాని వేళ పులస వచ్చే.. ఎగిరి గంతేసిన నాన్ వేజ్ ప్రియుడు
వేళ కాని వేళలో పులస రావడంతో పులస ప్రియుడు ఎగిరి గంతేశారు.. అకస్మాత్తుగా మత్స్యకారుడి వలకు చిక్కి ప్రత్యక్షమవడంతో కొనుక్కునేందుకు ఎగబడ్డారు. ...

దిశ, అమలాపురం: వేళ కాని వేళలో పులస రావడంతో పులస ప్రియుడు ఎగిరి గంతేశారు.. అకస్మాత్తుగా మత్స్యకారుడి వలకు చిక్కి ప్రత్యక్షమవడంతో కొనుక్కునేందుకు ఎగబడ్డారు. చివరకు రూ. 4 వేలు చెల్లించి దక్కించుకున్నాడు ఓ పులస ప్రియుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం గోదావరిలోకి పులస కొట్టుకు వచ్చింది. గోదావరి లో జాలరికి చిక్కిన పులస పి.గన్నవరం చేపల మార్కెట్లో రావడంతో పులస ప్రియులు కొనేందుకు ఎగబడ్డరు. సీజన్ కాని సీజన్‌లో పులస మార్కెట్లోకి రావడంతో మార్కెట్‌లోకి వచ్చిన ఒక్క పులస ధర నాలుగువేల రూపాయలు పలికింది.
సాధారణంగా వరదల సమయంలో వచ్చే పులసలు అన్ సీజన్‌లో రావడంతో పులసను కొనేందుకు ఎగబడ్డరు పులస ప్రియులు. జూలై , ఆగస్టు నెలలో వరద నీటికి ఎర్ర నీరుకు ఎదురు ఈదుకుని వచ్చే పులస ఏప్రిల్ నెలలో గోదావరిలో దొరకడం చాలా అరుదు అని అందుకే చిన్న చేప అయినా ధర అదికగా పలికింది అంటున్నారు. అయితే మార్కెట్లోకి పులసను కొనేవాళ్ళు కంటే ఇప్పుడు పులస రావడం ఏంటని పులసను చూసేందుకు జనం గుమిగూడారు.






