పీఎస్ఆర్‌కు మే 7 వరకు రిమాండ్.. కోర్టులో స్వయంగా వాదించుకున్న ఆంజనేయులు

by Bhoopathi Nagaiah |

ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు మే ఏడవ తేదీ వరకు రిమాండ్ విధించింది.

పీఎస్ఆర్‌కు మే 7 వరకు రిమాండ్.. కోర్టులో స్వయంగా వాదించుకున్న ఆంజనేయులు
X

దిశ డైనమిక్ బ్యూరో : ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు కోర్టు మే ఏడవ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు విజయవాడ మూడో ఏసీజేఎం కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన జత్వానిపై అక్రమ కేసు బనాయించిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. పీఎస్ఆర్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈరోజు ఉదయం ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగగా జడ్జి ముందు పీఎస్ఆర్ తన వాదనలను తానే వినిపించారు. జత్వాని కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై కేసు పెట్టారని తెలిపారు. మాజీ డీసీపీ విశాల్ గున్ని అప్రూవర్గా మారి ఈ కేసులో సంబంధం లేని విషయాలను చెప్పించారని ఆరోపించారు. పీఎస్ ఆర్ ను మంగళవారం హైదరాబాదులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి. అనంతరం న్యాయస్థానానికి తరలించారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో పి ఎస్ ఆర్ ను రిమాండ్ కు తరలించారు.


Next Story