మరోసారి పీఎస్‌ఆర్‌‌కు నిరాశ.. బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

by Kema Shiva Kumar |

APPSC‌లో జరిగిన అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోసం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హైకోర్టు (High Court)లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మరోసారి పీఎస్‌ఆర్‌‌కు నిరాశ.. బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: APPSC‌లో జరిగిన అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోసం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హైకోర్టు (High Court)లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దిగువ కోర్టు పీఎస్‌ఆర్‌కు బెయిలిచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ ఆ పటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించింది. అదేవిధంగా కేసులో మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న మరో పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా, విచారణలో భాగంగా హైకోర్టు (High Court) ఆదేశాలకు అనుగుణంగా ఆన్సర్ షిట్ల వాల్యుయేషన్ (Valuation of answer sheets) చేపట్టామని కోర్టుకు పీఎస్ఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లకుండా మాన్యువల్‌‌గా వాల్యుయేషన్ చేయాలన్నది నాటా ఏపీపీఎస్సీ (APPSC) ఇన్‌చార్జ్, చైర్మన్‌ నిర్ణయమని పేర్కొన్నారు. వాల్యుయేషన్ చేసే సిబ్బందికి వసతి, భద్రత దృష్ట్యా హాయ్‌లాండ్‌ను ఎంపిక చేశామని ధర్మాసనానికి తెలిపారు. ఏపీపీఎస్సీకి శాశ్వత చైర్మన్ నియామకంపై కదలిక రావడంతోనే వాల్యుయేషన్ హోల్డ్‌లో పెట్టారని.. డిజిటల్‌ వాల్యేయేషన్ ఏమైనా తప్పులు దొర్లాయో చూసేందుకు క్యామ్‌సైన్‌ మీడియా సంస్థకు పనులు అప్పగించామని వివరించారు. ఏపీపీఎస్సీ (APPSC)లో తీసుకున్న నిర్ణయాల్లో అందరి ప్రమేయం ఉందని.. పోలీసుల ఆరోపణల్లో వాస్తవం లేదని, తన క్లయింట్ అమాయకుడని పీఎస్ఆర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Next Story