- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
APPSC కేసులో రెండో రోజు పీఎస్ఆర్ ఆంజనేయులు విచారణ
by Jakkula.Mamatha |
ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు నిన్న(ఆదివారం) విచారించిన విషయం తెలిసిందే.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు నిన్న(ఆదివారం) విచారించిన విషయం తెలిసిందే. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో నిందితులు ఏ1 పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ2 మధుసూదన్లను ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించారు.
వారిని ఆదివారం రాత్రి సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. పీఎస్ఆర్‌ను సుమారు 30కి పైగా ప్రశ్నలను పోలీసులు అడిగారని సమాచారం. ఈ క్రమంలో వారిని పోలీసులు రెండో రోజు(సోమవారం) విచారించనున్నట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ఇద్దరిని విజయవాడ జైలుకు తరలించనున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుకు నేటితో కస్టడీ ముగియనుంది.
Next Story






