- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎస్ఆర్ ఆంజనేయులుకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
నటి కాదంబరీ జత్వానీ కేసు (Kadambari Jethwani)లో కీలక నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును (PSR Anjaneyulu) ఈ నెల 25న విజయవాడ కోర్టు (Vijayawada Court) మూడు రోజుల పాటు సీఐడీ (CID) కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: నటి కాదంబరీ జత్వానీ కేసు (Kadambari Jathwani)లో కీలక నిందితుడు పీఎస్ఆర్ ఆంజనేయులును (PSR Anjaneyulu) ఈ నెల 25న విజయవాడ కోర్టు (Vijayawada Court) మూడు రోజుల పాటు సీఐడీ (CID) కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని సదరు అధికారులకు సూచించింది. అయితే, ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంజనేయులను ఇవాళ సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కేసులో కీలక విషయాలపై ప్రశ్నించి.. ఆయన నుంచి సమాచారం రాబట్టి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ అధికారులు భావించారు. కానీ, అనూహ్యంగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఇవాళ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షల అనంతరం ఇవాళ అధికారులు తిరిగి ఆంజనేయులు విచారిస్తారా..? లేక సోమవారానికి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాల్సిందే మరి.






