- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నిరసన సెగ
ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నిరసనల సెగ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు నిరసనల సెగ తగిలింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో ఏపీ జెన్‌కో ప్రతిపాదిత 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్థులు.. ముఖ్యంగా గిరిజనులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ నేడు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేస్తుండగా గిరిజనులు ఆకస్మికంగా ధర్నాకు దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్లాంట్ వల్ల కలిగే కాలుష్యం, పర్యావరణ హాని, ఆరోగ్య సమస్యలపై గ్రామస్తులు ఎమ్మెల్యేను నిలదీశారు. తమ గ్రామంలో థర్మల్ ప్లాంట్ వద్దే వద్దని తేల్చి చెప్పారు. అయితే ప్లాంట్ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని, ప్రజల అభిప్రాయాలు తీసుకునే ముందుకు వెళ్తామని హామీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు అనవసర భయాలు సృష్టించి రెచ్చగొడుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని కూన రవికుమార్ ప్రజలను కోరారు.






