Gottipati Ravi Kumar : జగన్ హయాంలోనే విద్యుత్ చార్జీల పెంపు : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-27 08:17:18  IST  )

విద్యుత్ చార్జీలపై వైసీపీ నిరసనలు(YCP Protests) రాజకీయ డ్రామాల(Political Dramas)ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Power Minister Gottipati Ravikumar) విమర్శించారు.

Gottipati Ravi Kumar : జగన్ హయాంలోనే విద్యుత్ చార్జీల పెంపు : విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ చార్జీలపై వైసీపీ నిరసనలు(YCP Protests) రాజకీయ డ్రామాల(Political Dramas)ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Power Minister Gottipati Ravikumar) విమర్శించారు. కూటమి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ చార్జీలను పెంచలేదని, వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చార్జీల పెంపు ప్రతిపాదన మాజీ సీఎం జగన్ రెడ్డి(YS Jaganmohan Reddy) హయాంలోనే జరిగిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయని గుర్తు చేశారు. ఎన్నికల దృష్ట్యా వసూలు ఉత్తర్వులు ఇవ్వకుండా ఎన్నికలు ముగిశాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈఆర్సీ అనుమతించిందన్నారు.

10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదని విమర్శించారు. జగన్ విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాదించి.. నేడు వాటిపై ధర్నాలు చేయడం తుగ్లక్ చర్యగా గొట్టిపాటి ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి, ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు. ఇవ్వన్నీ తెలిసి కూడా దొంగే దొంగ అన్నట్టు జగన్ తీరు ఉందంటూ విమర్శలు గుప్పించారు. జగన్ అనుసరించిన విద్యుత్తు విధానాల భారం ఇప్పుడు ప్రజలపై సర్ధుబాటు చార్జీల రూపంలో పడిందన్నారు.

Next Story