- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త... వారందరికీ ప్రమోషన్లు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ( adhra pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ( RTC) ఉద్యోగు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ( adhra pradesh) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ( RTC) ఉద్యోగులకు సంబంధించి ఓ నిర్ణయానికి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఆర్టీసీ లోని కొంతమంది ఉద్యోగులకు ప్రమోషన్లు ( Promotions for employees ) ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. గత కొన్ని రోజులుగా ఈ ప్రమోషన్ల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మొత్తం 110 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి.
మెరిట్ రేటింగ్ (Merit List) రిపోర్టుల ఆధారంగా మొత్తం 110 మందిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్ల నాటి కల నెరవేరబోతుందని ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించిన 112.50 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. అలాగే గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 400 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను సేవా సంస్థలకు కేటాయించేందుకు నిబంధనలను సవరించింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.






